దేవరకద్ర : మున్సిపాలిటీ కేంద్రంలో ఏ ఒక్క డెంగ్యూ కేసు ( Dengue disease ) నమోదైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి (Collector Vijayendra Boi) హెచ్చరించారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతిరోజు ఓపీ రోగులు ఎంతమంది వస్తున్నారు. వివరాలు డాక్టర్ శరత్ చంద్రను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటించి ఇంటి సమీపంలో విపరీతంగా మొక్కలు, చెత్తచెదారాలు ఉండటంతో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే సంబంధిత ఇంటి యాజమాన్లతో మాట్లాడి వారి ప్రాంగణంలో ముళ్ళ చెట్లను,పొదలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కాలంలో పర్యటించి డ్రైనేజీలో చెత్తాచెదారం పారవేయవద్దని ఇంటి యజమానులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటంపై ఆగ్రహం
మీనుగువాని పల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, ఒకే గది ఉండడంతో చాలామంది విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు వెంటనే పూర్తి అయ్యో విధంగాచర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం మండల పరిధిలోని డోకూర్ గ్రామ సమీపంలోని కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు తదితరులు ఉన్నారు.