Acress Poorna Marriage | షామ్నా కాసీం.. అదేనండీ నటి పూర్ణ పెండ్లి వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. దుబాయికి చెందిన వ్యాపారవేత్తను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పూర్ణ.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. దీపావళి సందర్భంగా పూర్ణ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూస్తుంటే ముస్లిం సంప్రదాయ ప్రకారం.. కొద్దిమంది అతిథుల మధ్యనే వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పెండ్లి ఫొటోల్లో నిలువెత్తు బంగారం ధరించి బుట్టబొమ్మలో మెరిసిపోయింది పూర్ణ. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. పూర్ణ ఎంత బంగారం వేసుకుని ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
పెండ్లిలో పూర్ణ వేసుకున్న బంగారం గురించి ఆరా తీయగా.. అది దాదాపు 170 తులాల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ బంగారం మొత్తం ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ పెండ్లి కానుకగా ఇచ్చాడంట. అంతేకాదు పూర్ణ పేరు మీద ఒక లగ్జరీ విల్లా కూడా రాసిచ్చాడని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. అమ్మో అంత బంగారం గిఫ్ట్‌గా ఇచ్చాడా అని ఆశ్చర్యపోతున్నారు.
కాగా.. దుబాయికి చెందిన షానిద్ ఆసిఫ్ అలీతో ఈ ఏడాది మేలోనే పూర్ణ ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 12న వీరిద్దరి పెండ్లి కొద్దిమంది అతిథుల మధ్య జరిగింది. అయితే ఈ విషయాన్ని దీపావళి కానుకగా పూర్ణ రివీల్చేసింది. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా ప్రస్తుతం పూర్ణ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో అరడజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇవేకాకుండా ఓ డ్యాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
“Actress Poorna | దుబాయ్‌లో ఘనంగా నటి పూర్ణ వివాహం.. ఫొటోలు వైరల్..!”
“Poorna | చూపులతో మదిని గిల్లుతున్న పూర్ణ..”