వనపర్తి రూరల్, డిసెంబర్ 9 : ప్రభుత్వం, స్వచ్ఛం ద సంస్థల సహకారంతో వృద్ధిలోకి రావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పెద్దగూడెం తండాలో ఆర్‌ఈసీఎల్ న్యూఢిల్లీ సహకారంతో ఇక్రిశాట్, బైఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మంత్రి హాజరై గొర్రె పిల్లలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం వృద్ధి సాధించేందుకే గొర్రె పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ స హకారం అభినందనీయమని పేర్కొన్నారు. గొర్రెల పం పిణీ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అనంతరం గిరిజన మహిళలు లక్ష్మికి రూ.25 వేలు, లాలమ్మకు రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచులు లక్ష్మి, రామకృష్ణ, ఎంపీటీసీ ధర్మనాయక్, లోకారెడ్డి, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాసులు, అశోక్, నరసింహ, రవికుమార్, నారాయణ నాయక్, టీక్యానాయక్, కృష్ణానాయక్, రూప్లానాయక్, దేవుడ్యానాయక్, జాన్యానాయక్, శంకర్ నాయక్, సిబ్బంది దశరథం, సుందర్ పాల్గొన్నారు.
పిల్లల సంరక్షణకే అంబులెన్స్..
వనపర్తి, డిసెంబర్ 9 : పిల్లల రక్షణ, సంరక్షణ కోస మే బాల రక్షక్ అంబులెన్స్‌ను వినియోగించాలని మం త్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను అధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అ నంతరం చిన్నపిల్లల పెరుగుదల వివరాలు నమోదు చే సేందుకు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్‌తోపాటు చీరెలను, కరోనా సమయంలో మృతి చెందిన కుటుంబీకులకు కేర్ ఇండియా అందించిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకట రమణమ్మ, డీడబ్ల్యూ వో పుష్పలత, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అలివేలమ్మ, స భ్యులు వనజ, నళిని, గిరిజా, విజయలక్ష్మి, బీఆర్బీ కో ఆర్డినేటర్ కృష్ణచైతన్య, డీసీపీవో రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..
అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్సలు చేయించుకునే బాధితులకు సీఎం సహాయ నిధి ఎల్లప్పుడూ అం డగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 20 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశా రు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.