అమరావతి : బాపట్ల ( Bapatla ) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో (Granite quarry ) ఆదివారం దయం బండరాయి ( Boulder fell ) జారి పడటంతో ఆరుగురు కార్మికులు ( Six Labours Died) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన కార్మికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో క్వారీలో సుమారు 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, గ్రానైట్ క్వారీలో కూలిన శిథిలాలను క్వారీ సిబ్బంది తొలగిస్తున్నారు. క్వారీ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ , దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. గాయపడ్డ వారిపై మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ చేయాలని ఆదేశించారు.