బంజారాహిల్స్, డిసెంబర్ 13 : మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కొత్తచెరువు వైపునకు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు రామానాయుడు స్టూడియోస్ కింది భాగంలోకి రాగానే అదుపుతప్పి.. కొత్తగా కట్టిన సెంట్రల్ మీడియన్‌ను ఢీకొట్టింది. విపరీతమైన వేగం ఉండటంతో కారు తుక్కుతుక్కయింది. బెలూన్స్ తెరుచుకోవడంతో కారు నడిపిస్తున్న అర్మాన్ అనే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారును మూడురోజుల కిందటే కొనుగోలు చేసినట్లు తేలింది.