హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చారు. ఈసారి చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు గుర్తించి.. మంగళవారం ఉదయం అతడి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు రవీందర్‌తోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన ఇండ్లు, కార్యాలయాలు సహా 11 ప్రదేశాల్లో తనిఖీ చేశారు.
హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్‌లో జరిగిన ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. రూ.9.24 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.70 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణతో)లోని సెక్షన్ 13(1)(బీ), 13(2) ప్రకారం అతడిని అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14రోజుల రిమాండ్ విధించారు.
ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు..