బటిండా: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త చితకబాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ కానీ, ఆమె భర్త కానీ ఎటువంటి పోలీసు ఫిర్యాదు చేయలేదు. ఎమ్మెల్యే, ఆమె భర్త మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అక్కడ మరికొంత మంది ఉన్నారు. ఓ దశలో ఆవేశానికి లోనైన భర్త.. ఎమ్మెల్యే బల్జిందర్ చెంప చెల్లుమనిపించాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ మహిళ కమిషన్ చైర్మెన్ మనీషా గులాటి ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారు. సుమోటో నోటీసుగా స్వీకరించనున్నట్లు ఆమె చెప్పారు.
Empowering women is not a deterrent to stop violence against women.Shocking to see @BaljinderKaur_ MLA getting slapped in broad day light.Mindset of men has to change.
The problem lies in the perpetrator’s of these acts.Change this male chauvinism attitude more then anything else pic.twitter.com/Qxm6rhrtht— Brinder (@brinderdhillon) September 1, 2022