AAP Haryana chief : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆప్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులు బీజేపీకి చెంపపెట్టని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం గుప్తా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాషాయ పాలకులు లక్ష్యంగా విరుచుకుపడ్డారు. కాషాయ పాలకులు అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో జైల్లో నిర్బందించినందుకు వారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలవుతున్న క్రమంలో తాను అందరికీ అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. కేజ్రీవాల్ వెన్నంటి నిలిచిన పార్టీ నేతలు, ఆప్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కేజ్రీవాల్ విడుదలతో హరియాణ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. హరియాణలో అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, హరియాణా ఎన్నికల్లో విజయం సాధించి తమ ప్రభుత్వం కొలువుతీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది.
ఇక సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో 6 పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలకానున్నారు. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసుకు సంబంధించి పెదవివిప్పరాదని, కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Read More :
BRS | అక్రమ అరెస్టులపై భగ్గుమన్న బీఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు : ఫొటోలు