ఊట్కూర్, సెప్టెంబర్ 26 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పేరును యువకుడు పచ్చబొట్టు(Tattoo) వేయించుకున్నాడు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రమేశ్.. కేసీఆర్పై ఉన్న అభిమానంతోనే కుడి చేతిపై టాటూ వేయించుకున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం కింద వంద శాతం సబ్సిడీతో ట్రాక్టర్ తీసుకున్నామన్నారు.
ప్రస్తుతం అదే తమ కుటుంబ జీవనోపాధికి ఉపయోగపడుతోందని తెలిపారు. దీంతో మణికట్టుపై కనిపిస్తున్న ‘కేసీఆర్’ టాటూ.. రమేశ్ కుటుంబానికి అందిన ట్రాక్టర్ సాయం స్థానికంగా చర్చనీయాంశంగా మరింది.