న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: విస్తారా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..త్వరలో ఈ సంఖ్యను 5 వేలకు పెంచుకోబోతున్నట్టు ప్రకటించింది. కరోనాతో కుదేలైన దేశీయ విమానయానం ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నదని, ముఖ్యంగా థర్డ్‌వేవ్ కూడా ప్రతికూల ప్రభావం చూపిందని విస్తారా సీఈవో వినోద్ కన్నన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా విమాన ప్రయాణికులు పెరుగుతుండటంతో మరో రెండు నెలల్లో కరోనాకు ముందు పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.