హైదరాబాద్ : ఆయన ఓ పోలీసు అధికారి.. శాంతిభద్రతలను కాపాడుతూ నియమ నిబంధనలు పాటించి ఆదర్శంగా నిలువాల్సిన ఆఫీసర్ మనవరాలి కోసం రూల్స్‌నే బ్రేక్ చేశాడు. అడిగిన వారిపై బెదిరింపులకు పాల్పడటం విమర్శలు వెల్లువెత్తుఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇదేంటని అడిగిన స్థానికులపై సదరు ఎస్ఐ నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ఎస్ఐ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.