Arrest | హత్యకు కుట్ర భగ్నం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గరు షూటర్లు అరెస్ట్
Arrest | ఢిల్లీ (Delhi) పరిధిలోని రోహిణి జిల్లా (Rohini district) ప్రత్యేక పోలీసు దళం తాజాగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు షూటర్ల (Shooters) ను అరెస్ట్ చేసింది. వారు ఢిల్లీలో ఓ హత్యకు కుట్ర చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం ముందుగా అందడంతో రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ వీరి కదలికలపై నిఘా ఉంచి చివరకు అదుపులోకి తీసుకుంది.
Arrest : ఢిల్లీ (Delhi) పరిధిలోని రోహిణి జిల్లా (Rohini district) ప్రత్యేక పోలీసు దళం తాజాగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు షూటర్ల (Shooters) ను అరెస్ట్ చేసింది. వారు ఢిల్లీలో ఓ హత్యకు కుట్ర చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం ముందుగా అందడంతో రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ వీరి కదలికలపై నిఘా ఉంచి చివరకు అదుపులోకి తీసుకుంది. విదేశాల్లో ఉన్న నెట్వర్క్ ద్వారా ఈ షూటర్లకు ఆదేశాలు అందుతున్నాయని, వాటి ఆధారంగానే వీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం.
ఢిల్లీలో గతంలో జరిగిన పలు నేరాల్లో ఈ షూటర్లు నిందితులుగా ఉన్నారు. గతంలోనూ వీరు నిర్దేశిత లక్ష్యాలపై కాల్పులు జరిపిన ఘటనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికాలోనూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అక్కడి దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా పెట్టాయి. జూలై 7 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ముఠాపై ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ ముఠాతోపాటు అతడి ప్రధాన అనుచరులైన గోల్డీ బ్రార్, జగ్గూ భగవాన్‌పురియా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ గోల్డీ బ్రార్‌పై కఠిన చర్యలకు సిద్ధమైంది. సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అరెస్టుకు అవసరమైన సమాచారం అందించిన వారికి 50,000 డాలర్ల (సుమారు రూ. 43 లక్షలు) బహుమతిని అందజేస్తామని ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు వంటి అనేక కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. అతడి గ్యాంగ్‌లో పెద్ద సంఖ్యలో షూటర్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

