సీట్ బెల్ట్‌పై అఖండ అవగాహన
- సినిమాలోని సీన్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్రాఫిక్ సీపీ
- హీరో, డైరెక్టర్లకు ధన్యవాదాలు

సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ‘అఖండ’ తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్ జీపులో వెళ్తుండగా.. హీరో సడన్ బ్రేక్ వేయడంతో.. పక్క సీట్లో కూర్చున్న హీరోయిన్ తల ముందు గుద్దుకుంటుండగా హీరో ఆమె నుదిటిపై చేయి పెట్టి దెబ్బ తగలకుండా ఆపుతాడు.. ఇదంతా హీరోయిన్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే జరిగిందనే సందేశాన్ని సినిమాలో చూపించారు. సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో ఉండే హీరోయిన్ సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా తాను ఎంతో తప్పు చేశాననే విధంగా అక్కడ సన్నివేశం ఉంటుంది. సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి ఆ సినిమాలో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను చక్కగా వివరించారని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ప్రశంసించారు. ఆ సన్నివేశాన్ని ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. రోడ్డు సేఫ్టీపై అవగాహన తెచ్చే విధంగా సన్నివేశాన్ని చిత్రీకరించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తమ వంతు కృషి చేసిన హీరో, డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.
కారులో సీట్‌బెల్ట్, ద్విచక్రవాహనంపై హెల్మెట్ తప్పనిసరి
కారులో వెళ్లే వారు తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు హెల్మెట్ ధరించడంతో అనుకోకుండా జరిగే ప్రమాదాలలో ప్రాణహాని నుంచి తప్పించుకునేందుకు అవకాశముంటుంది. ఈ నిబంధనలు పాటించకపోవడంతో ప్రతియేడు వందల సంఖ్యలో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తీసుకొచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సినిమాలో కూడా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన అంశాలు ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చేవిధంగా ఉండటంతో ప్రజలు తప్పకుండా పాటిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- akhanda movie
- seat belt
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

