రోస్టర్ పాయింట్లతో తీవ్ర అన్యాయం.. 57 ఎంబీఎస్సీ కులాల సమావేశంలో వక్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన రోస్టర్ పాయింట్లతో అత్యంత వెనుకబడిన 57ఎంబీఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని పలువురు వక్తలు ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ) : తక్షణమే రోస్టర్‌ను సవరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు తదితర అంశాలపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో గ్రూప్-1 కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 కులాలకు 2వ రోస్టర్, గ్రూప్-3 కులాలకు 16వ రోస్టర్ కేటాయిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు దళిత మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. కనీసం కులధ్రువీకరణ పత్రాలు జారీచేయడం లేదని, అందులోనూ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. 57 ఎంబీఎస్సీ కులాలకు న్యాయం జరిగేవరకూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సదస్సులో దక్షిణ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, అగ్రవర్ణ పేదల జేఏసీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాసర్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, పీసీసీ మహిళా నేత జీవనజ్యోతి, ఉపదే సనధన్, కర్నె రామారావు, బత్తుల పాండు, మన్నె సుధాకర్, శాఖమూరి యాదగిరి, కురువ బాలరాజు, నాగయ్యస్వామి, అంతోని సురేశ్, గడ్డం విష్ణు, కొలుపుల రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

