ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ
ఉద్యమకారుడి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల యజమానిని కోల్పోయి వీధినపడ్డ సదరు కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షలు అందజేశారు. అంతేగాక ఫోన్‌చేసి అన్ని విధాలా అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. బీఆర్ఎస్ సర్కార్ రాగానే ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్దన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
- బీఆర్ఎస్ తరఫున 10 లక్షల ఆర్థిక సాయం
- జనార్దన్ కుటుంబానికి కేటీఆర్ ఫోన్ చేసి హామీ
- ఎఫ్డీలు అందజేసిన సత్యవతి, రెడ్యానాయక్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/దంతాలపల్లి: ఉద్యమకారుడి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల యజమానిని కోల్పోయి వీధినపడ్డ సదరు కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షలు అందజేశారు. అంతేగాక ఫోన్‌చేసి అన్ని విధాలా అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. బీఆర్ఎస్ సర్కార్ రాగానే ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్దన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, తల్లి ఉన్నారు. వీరికి కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో టెంట్ కిందనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. మృతుడి కుటుంబ వివరాలు తెలుసుకుని అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. జనార్దన్ ముగ్గురి కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీ కవిత పెద్దముప్పారం వెళ్లి జనార్దన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.9 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లతోపాటు మృతుడి సతీమణి మల్లికకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్ చేసి జనార్దన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మన ప్రభుత్వం వచ్చాక మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్యవతి రాథోడ్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

