తమిళ దర్శకుడితో భారీ అడ్వెంచర్?
‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ కోసం చాలామంది దర్శకులే క్యూ కట్టారు. అయితే.. అయన మాత్రం విభిన్నంగా ఆలోచించి గీతూ మోహన్‌దాస్‌కి అవకాశం ఇచ్చారు.
వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ ‘రామాయణం’లో రావణుడిగా నటిస్తూ యశ్ బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి భాగం దీపావళి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
మరి ‘రామాయణ’ ఫ్రాంచైజీ తర్వాత యశ్ చేసే సినిమా ఏంటి? ఆయన సోలో హీరోగా ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అనే ప్రశ్నలు ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి. అయితే.. తాజాగా తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇచ్చిన అప్డేట్తో ఈ చర్చలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది.
‘ఇండియానా జోన్స్’ తరహాలో ఒక భారీ అడ్వెంచర్ కథను ఇటీవలే యశ్‌కు వినిపించానని, యశ్‌కు కూడా ఆ కథ బాగా నచ్చిందని, ‘రామాయణ’ కమిట్మెంట్స్ పూర్తయ్యాక, ఈ ప్రాజెక్ట్ వర్క్ మొదలవుతుందని మిత్రన్ చెప్పారు. ఇది యశ్ అభిమానులకు నిజంగా శుభవార్తే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

