పెంపుడు పిల్లి తెచ్చిన లొల్లి
ఓ పెంపుడు పిల్లి రెండు కుటుంబాల మధ్య లొల్లికి కారణమైంది. పిల్లి తమదంటే తమదని ఘర్షణకు దిగగా, పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.
- తమదంటే తమదని రెండు కుటుంబాల ఘర్షణ
- పోలీసు స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు
- సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్నగర్ , ఫిబ్రవరి 22: ఓ పెంపుడు పిల్లి రెండు కుటుంబాల మధ్య లొల్లికి కారణమైంది. పిల్లి తమదంటే తమదని ఘర్షణకు దిగగా, పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ విచిత్ర ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. పట్టణంలోని దద్దనాల చెరువు ప్రాంతానికి చెందిన మద్దెల ముత్యాలు ఏడాది క్రితం మైసూరులో జూలు కుక్క లక్షణాలున్న పిల్లిని కొనుగోలు చేసి పెంచుకొంటున్నాడు. అయితే, 10 నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి కనిపించట్లేదు. ఇటీవల పట్టణంలోని రామస్వామిగట్టు వద్ద జాతర జరుగుతున్న సమయంలో బానోతు సుక్కమ్మ ఇంటి వద్ద పిల్లిని ముత్యాలు గమనించాడు. మంగళవారం సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి తనదేనని, మైసూరులో కొన్నానని తనకు ఇవ్వాలని అడిగాడు. ఆమె ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. మాటామాటా పెరిగి పిల్లి పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పి పిల్లిని సుక్కమ్మకు అప్పగించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

