అమరావతి : ఏపీలో శనివారం జరిగిన అగ్నిప్రమాదం( Fire ) లో ఒకరు సజీవదహన మయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు ( Eluru ) జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలోని తోటలో కొబ్బరి కాయలు కోతకు 18 మంది కూలీలు వెళ్లారు. కాయలు కోస్తుండగా విద్యుత్ తీగలు లారీపై పడడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో లారీపై కూర్చున్న పి. మల్లికార్జున అనే వ్యక్తి కి మంటలు అంటుకుని సజీవదహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.