హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగుల పనిగంటలు, ఉద్యోగ భద్రతపై ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.