పట్టణం అంటే ఓ కాంక్రీట్ జంగల్..ఇక్కడ మనుషుల గజిబిజి జీవితాలు తప్ప చెట్టు, పుట్ట, పిట్ట కనిపించవు. కానీ మహబూబాబాద్ పట్టణంలోని ఈ ఇంటికి వెళ్తే పిచ్చుకల కిచకిచలు.. చిలుకల కిలకిలరావాలు.. తీరొక్క రంగులో మెరిసే విహంగాల సందడి మనల్ని కట్టిపడేస్తుంది. ఆ ఇళ్లంతా సరికొత్త సంగీత రాగాలు వినిపిస్తుంటాయి. ఒక్కసారి వాళ్లింటికి వెళ్తే మళ్లీ అక్కడినుంచి కదలబుద్ధి కాదంటే నమ్మండి.. మరి ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.