మెదక్ రూరల్ : మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో గణేష్ నిమజ్జనం ( Ganesh immersion ) ఘనంగా నిర్వహించారు. బాల గణేష్ మండలి, శ్రీ రేణుక మాత గణేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథునికి 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి ట్రాక్టర్‌పై వినాయకుడిని ఊరేగించి బాణాసంచ కాల్చి, డప్పుల వాయిద్యాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
చిన్నలు, పెద్దలు, మహిళలు శోభాయాత్రలో నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పసుపులేరులో గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో గణేష్ మండలి గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి నిర్వాహకులు సందీప్, మహేష్, రాకేష్, గణేష్, నాగరాజు, భాను చందర్ రెడ్డి, రాంప్రసాద్, ప్రశాంత్, ప్రదీప్, రావి, విష్ణు, అరిఫ్, విట్టల్, సంతోష్, లింగం, గంగ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.