Hemanth Kumar | అతను చేసే సాయానికి పబ్లిసిటీ అక్కర్లేదు.. ఎదుటివాళ్ల మొహంలో చిరునవ్వు చూస్తే చాలు!
చెన్నై మహానగరంలో.. గందరగోళపు బతుకులతో.. మనుషులు సాటి మనిషి ఉనికినేమరిచిపోయిన వాతావరణంలో.. ఓ నిశ్శబ్ద యోధుడు మానవత్వం మీద ఆశలు చిగురింపజేస్తున్నాడు. అతనే 23 ఏండ్ల హేమంత్ కుమార్. ఫుట్‌పాత్‌లే ఆవాసంగా బతుకీడుస్తున్న అభాగ్యుల సేవకు అంకితమయ్యాడు ఆ యువకుడు.
Hemanth Kumar | చెన్నై మహానగరంలో.. గందరగోళపు బతుకులతో.. మనుషులు సాటి మనిషి ఉనికినేమరిచిపోయిన వాతావరణంలో.. ఓ నిశ్శబ్ద యోధుడు మానవత్వం మీద ఆశలు చిగురింపజేస్తున్నాడు. అతనే 23 ఏండ్ల హేమంత్ కుమార్. ఫుట్‌పాత్‌లే ఆవాసంగా బతుకీడుస్తున్న అభాగ్యుల సేవకు అంకితమయ్యాడు ఆ యువకుడు. ఇల్లు, ఆఫీస్ మధ్య బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు.. రోడ్డు వెంబడి దీనంగా కనిపించే వారిని చూసిన ప్రతిసారీ హేమంత్ గుండె తరుక్కుపోయేది. వాళ్లకు చేతనైనంత సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. 18 నెలలుగా ఆ సేవా యజ్ఞమే చేస్తున్నాడు. ఈ నిర్ణయం వెనక మరో నేపథ్యమూ ఉంది.
ఒకసారి హేమంత్ కొందరు నిరుపేద బాలికల్ని కలుసుకున్నాడు. వారికి చాక్లెట్లు ఇచ్చాడు. ఆ క్షణంలో వారి మొహాల్లో కనిపించిన మెరుపు అతనిపై ప్రగాఢ ప్రభావం చూపింది. ఒక చిన్న మిఠాయే అంత సంతోషాన్ని ఇస్తే… అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటే ఇంకెంత సంతృప్తి దొరుకుతుందో అనిపించింది. ఆ క్షణమే అభాగ్యులకు చేతనైనంత సాయం చేయాలని సంకల్పించుకున్నాడు. వెంటనే కార్యరంగంలో దిగాడు. అయితే, ఎవరికైనా సాయం చేస్తున్నప్పుడు హేమంత్ తానెవరో తెలియకుండా మొహాన్ని హెల్మెట్‌తో కప్పేసుకుంటాడు. సాయం పొందినవాళ్లు.. ఆశీర్వదించడానికి మొహం చూపించమన్నా ఒప్పుకోడు. ఇదంతా ఓ ప్రచార ఆర్భాటమని హేమంత్ మీద విమర్శలూ వచ్చాయి. వాటిని అతను పట్టించుకోలేదు. అలా విమర్శించిన వారు సైతం పరోపకార మహత్కార్యంలో హేమంత్‌తో జట్టుకట్టడం విశేషం. మెరీనాబీచ్ మొదలు బీసెంట్ నగర్ వరకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో హేమంత్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహారం, ఎండలో ఉన్నవారికి టోపీలు, గొంతెండిన వారికి పండ్లరసాలు, వర్షంలో తడుస్తున్నవారికి గొడుగులు లాంటివి
అందిస్తాడు అతను. ‘సాయం అందుకుంటున్నప్పుడు ఎదుటివారి మొహాల్లో ఒకరకమైన ఆనందం కనిపిస్తుంది. ఆ వెలుగే నాకు స్ఫూర్తి. నా కార్యక్రమాలను జీవితాంతం కొనసాగిస్తాను’ అని కృతనిశ్చయంతో చెబుతాడు హేమంత్.
Read More :
“Ameen Khwaja | చెప్పులు కుట్టే స్థాయి నుంచి ఎలక్ట్రానిక్స్ రంగంలో కింగ్‌లా మారాడు!”
Inspiration | తిందాం.. తిరుగుదాం.. వీళ్లలా డబ్బులు సంపాదిద్దాం!”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

