మేడ్చల్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాలలో ఉజ్యల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మం గళవారం ప్రారంభమైన పారా మెడికల్ ఓరియెంటేషన్ డే కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పారా మెడికల్ కోర్సులకు భారీగా డిమాండ్ ఉందని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. పారా మెడికల్ కోర్సులు చదివే విద్యార్థులు అందరూ సక్సెస్‌ను అందుకుంటారని భావిస్తున్నానని అన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి యూనివర్సిటీలో నూతనంగా అనేక కోర్సులను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి మా ట్లాడుతూ పారా మెడికల్ కోర్సులు చదివే విద్యార్థులు కష్టపడాలన్నారు. యూనివర్సిటీ డైరెక్టర్ మహేందర్‌రెడ్డి, ప్రీతిరెడ్డి, పారా మెడికల్ కోర్సుల ఇన్చార్జి ఆకాశ్‌లు జ్యోతి ప్రజల్వన చేసి ఓరియెంటేషన్ డేను ప్రారంభించారు.