దేశంలో కొత్తగా గుర్తించిన మధుమేహ రోగుల్లో 80 శాతానికి పైగా అసాధారణ కొవ్వుస్థాయిలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్-2 డయాబెటిక్ మిల్లిటస్ (టీ2డీఎం)తో బాధపడుతున్న 55 శాతం కంటే ఎక్కువ మందిలో గుండె సంబంధిత సమస్యలను తగ్గించే హై డెన్సిటీ లిపిడ్-కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్-సీ) తక్కువగా ఉన్నట్టు 5,080 మంది రోగులపై నిర్వహించిన ఇండియా డయాబెటిస్ స్టడీ వెల్లడించింది.