లండన్: బ్రిటన్‌లోని ఓ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లోకి ఓ కుర్రదొంగ జొరబడ్డాడు. తుపాకీ చూపి మేనేజర్ ను బెదరించి కొంత నగదు తీసుకున్నాడు. వచ్చిన పని అయిందని వెళ్లిపోయాడా అంటే లేదు. ఆకలిగా ఉందో ఏమో.. మేనేజర్‌ను మరోసారి తుపాకీతో బెదరించి నాకు మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగెట్స్ కావాలి అని డిమాండ్ చేశాడు. కొత్తదొంగ పొద్దెరగడు అన్నట్టుగా ఉదయం 7 గంటలకే వస్తే చికెన్ నగెట్స్ ఎలా ఉంటాయి.. ఆ డిష్ లంచ్ మెనూలో ఉన్నదాయె. మేనేజర్ ఆసంగతే చెప్పాడు. మధ్యాహ్నం దాకా ఉండడం దొంగకు కుదరదు కదా.. డబుల్ సాసేజ్ మెక్మఫిన్ అనే టిఫిన్ ప్లేటుతో దొంగ సరిపెట్టుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యవహారమంతా సీసీటీవీ కెమెరాలో నమోదైంది. మెక్‌డొనాల్డ్స్ మేనేజర్ ఆ వీడియోను ట్విట్టర్ లో ఉంచితే అది కాస్తా వైరల్ అయింది. నెటిజనులు రకరకాల కామెంట్లు పెట్టారు. ఒకరైతే మైకేల్ డగ్లస్ నటించిన ఫాలింగ్ డౌన్ సినిమాను గుర్తు చేసుకున్నారు.
Man, the pain of being denied the nuggies is real… @Localnewspod https://t.co/0uBm5FYaDO
— JC (@johnonthejohn) April 30, 2021