నాటు బాంబు పేలి ఏడేండ్ల బాలుడు మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ సిటీలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. నాటు బాంబు పేలడంతో ఏడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుర్ద్వాన్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. షేక్ ఇబ్రహీం(9), షేక్ అఫ్రోజ్(7) కలిసి తమ ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో తమ ఇంటికి సమీపంలో దొరికిన ఓ ప్యాకెట్‌ను నేలకేసి కొట్టారు. దాంట్లో ఉన్న నాటు బాంబు పేలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు బాలురను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఫ్రోజ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Crude Bomb
- West Bengal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

