Burkina Faso | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మిలిటెంట్, జిహాదీ గ్రూపులు మునుపెన్నడూ లేనంతగా మారణహోమం సృష్టిస్తున్నాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అన్న విచక్షణ లేకుండా గ్రామాల్లోకి చొరబడి కాల్పులకు తెగబడుతున్నాయి. ఇటీవలి మిలిటెంట్ల కాల్పుల్లో 600 మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఫ్రెంచ్ ప్రభుత్వ రక్షణ ఏజెన్సీ శనివారం అంతర్జాతీయ మీడియాకు తెలిపింది.