అబిడ్స్, జనవరి 29 : నగరవ్యాప్తంగా ఆయా జోన్ల వారీగా రహదారులపై వేగపరిమితిని బల్దియా కస రత్తును వేగవంతం చేసింది. ఇందులోభాగంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో ప్రధాన రహదారులపై వేగాన్ని నిర్ధారిస్తూ అధికార యంత్రాంగం శనివారం నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్టీఓ, ట్రాఫిక్ అధికారులందరూ సమావేశమై ఏ ఏ రోడ్లపై ఎంత వేగం ఉండాలో నిర్ణయించారు. ఈ వివరాలను జోనల్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ప్రకటించారు. రోడ్లు బాగా ఉన్న ప్రాంతాలలో వేగాన్ని గంటలకు 60 కిలోమీటర్లుగా. మిగిలిన చోట 40గా నిర్ధారించారు. స్పీడ్ లిమిట్ నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల ఎస్ఈలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయా జోనల్ ఎస్ఈలు ట్రాఫిక్, ఆర్టీఓ అధికారులతో ఇటీవల సమావేశమై స్పీడ్‌ను నియంత్రించేందుకు గాను ప్రాంతాల వారీగా వేగపరిమితిని నిర్ధారించారు. ఏ రోడ్డుపై ఎంత వేగంతో ప్రయాణించాలో తెలుపుతూ దారిగుండా సూచికలను ఏర్పాటు చేయనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై స్పీడ్గన్లు, సీసీ కెమెరాల సాయంతో కఠిన చర్యలు తీసుకోనున్నారు. ట్యాంక్‌బండ్ మాదిరిగా నగరంలోని పలు ప్రాంతాలలో స్పీడ్ గన్లను కూడా ఏర్పాటు చేయున్నారు.
త్వరలో వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం సహదేవ్ రత్నాకర్..
వాహనాల వేగాన్ని నియంత్రిస్తూ స్పీడ్ లిమిట్‌ను నోటిఫై చేశాం. పలు ప్రాంతాలలో 40 కిలో మీటర్ల వేగం, 50, 60 కిలోమీటర్ల వేగంగా నిర్ణయించాం. ఆయా ప్రాంతాలలో సీఆర్ఎంపీ ఏజెన్సీలు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తాం. వాహనదారులు ఆయా ప్రాంతాలలో నిర్ణయించిన వేగంలో మాత్రమే వాహనాలను నడపాల్సి ఉంటుంది.
ఎక్కడెక్కడ 60 ?
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 15 నుంచి
నానల్ నగర్ హ్యాండ్ సింబల్ వరకు
పిల్లర్ నెంబర్ 40 నుంచి 84 వరకు
ఇన్నర్ రింగ్ రోడ్
ఎన్ఎండీసీ నుంచి మాసాబ్ ట్యాంక్ ఎక్స్ రోడ్
నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి లక్డీకాపూల్ బ్రిడ్జి
టోలిచౌకి ఫ్లై ఓవర్ నుంచి గచ్చిబౌలి వరకు
టోలిచౌకి ఫ్లై ఓవర్ నుంచి హ్యాండ్ సింబల్
అఫ్జల్‌గంజ్ నుంచి సీబీఎస్
ఎంజె మార్కెట్ నుంచి నాంపల్లి టీ జంక్షన్
సంజీవయ్య విగ్రహం నుంచి డాక్టర్ బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వరకు
కళాంజలి నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వరకు
అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ మెట్రో స్టేషన్
ఈఎస్ఐ దవాఖానా నుంచి భరత్‌నగర్ ఫ్లై ఓవర్
ఆర్అండ్బీ కార్యాలయం నుంచి లాల్‌బంగ్లా ప్రధాన రహదారి
గ్రీన్లాండ్స్ నుంచి అమీర్‌పేట జంక్షన్
అమీర్‌పేట్ క్రాస్ రోడ్ నుంచి ఈఎస్ఐ దవాఖాన
శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ నుంచి నెక్ట్స్ గెలేరియా మెట్రో మాల్
లేక్‌వ్యూ రోడ్ నుంచి తాజ్‌కృష్ణా హోటల్
ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్
లుంబిని పార్క్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్
రవీంద్రభారతి నుంచి అంబేడ్కర్ విగ్రహం
ఇందిరాగాంధీ సర్కిల్ నుంచి మింట్ కాంపౌండ్
లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ నుంచి అయోధ్య జంక్షన్
మైత్రీ వనం నుంచి జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయం
ఎన్ఎఫ్సీఎల్ నుంచి కేబీఆర్ పార్క్
ఎన్ఎఫ్సీఎల్ జెఎన్ నుంచి రోడ్ నెంబర్ 1/12 బంజారా
సెనార్ వ్యాలీ నుంచి ఓల్డ్ ముంబాయి హైవే
టోలిచౌకి ఎక్స్ రోడ్ నుంచి దర్గా జంక్షన్
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కళింగ జంక్షన్
ఎక్కడెక్కడ 40?
పలు ప్రాంతాలలో 40 కిలోమీటర్ల వేగాన్ని నియంత్రిస్తూ నోటిఫై చేశారు
మెహిదీపట్నం సిగ్నల్ నుంచి ఎల్ఐసీ కార్యాలయం వరకు
యాదవ్ భవన్ నుంచి గుడిమల్కాపూర్ వరకు
జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ నుంచి మాసాబ్‌ట్యాంక్ సిగ్నల్
విజయనగర్ కాలనీ కెనరా బ్యాంక్ నుంచి ఎన్ఎండీసీ వరకు
మాసాబ్‌ట్యాంక్ చౌరస్తా నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్
పిల్లర్ నెంబర్ 15 నుంచి ఎన్ఎండీసీ
మల్లెపల్లి ఎక్స్ రోడ్ నుంచి బోయిగూడ కమాన్ వరకు
లంగర్‌హౌజ్ ఫ్లై ఓవర్ నుంచి ఒన్మోర్ కాలనీ మెయిన్ రోడ్
రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ మెయిన్ గేట్
అఫ్జల్‌గంజ్ నుంచి గురుద్వారా మీదుగా పుత్లిబౌలి ఎక్స్ రోడ్
నాంపల్లి జంక్షన్ నుంచి యూసుఫేన్ దర్గా
ఏక్‌మినార్ నుంచి దారుస్సలాం జంక్షన్ వరకు
ఆంధ్రాబ్యాంక్ నుంచి పుత్లిబౌలి
జీహెచ్ఎంసీ అబిడ్స్ కార్యాలయం నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్
పురానాపూల్ జంక్షన్ నుంచి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్
ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి టీ జంక్షన్ నాంపల్లి వరకు
సుజాత పాఠశాల నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం
ఖాన్ లతీఫ్ బిల్డింగ్ నుంచి స్టాన్లీ పాఠశాల
అయోధ్యజంక్షన్ నుంచి సంత్ నిరంకారి భవన్ రహదారి