లాతూర్: సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మహా అయితే రెండు, మూడు సార్లు పాటుకాటుకు గురయ్యే అవకాశం ఉన్నది. కానీ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా పట్టణానికి చెందిన ఒకతను గత 15 ఏండ్లలో 500 కంటే ఎక్కువసార్లు పాటుకాటుకు గురయ్యాడు. అతడి పేరు అనిల్ తుకారాం గైక్వాడ్. పొలం పనుల సమయంతో పాటు పట్టణ ప్రాంతానికి వెళ్లినప్పుడు కూడా పాము కాటేసేది. జనం సమూహంలో ఉన్న సమయంలో కూడా పాములు గైక్వాడ్నే ఎందుకు కాటేస్తున్నాయో తెలియడం లేదని అతడికి 150కి పైగా సార్లు చికిత్స అందించిన డాక్టర్ సచ్చిదానంద్ రణదివే అన్నారు.