న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో అధిక సంఖ్యలో రైలు సర్వీసులను నడుపుతున్నట్టు రైల్వే శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలను చేర్చేందుకు గతేడాదితో పోలిస్తే ఈ ఎండాకాలంలో 43 శాతం ఎక్కువగా రైలు ట్రిప్పులను ఆపరేట్ చేయనున్నట్టు తెలిపింది. డిమాండ్ నేపథ్యంలో భారతీయ రైల్వే ఈ ఏడాది సమ్మర్ సీజన్లో రికార్డు స్థాయిలో 9,111 ట్రిప్పులు(2023లో 6,369 ట్రిప్పులు) నిర్వహిస్తున్నామని పేర్కొన్నది. వీటిలో పశ్చిమ రైల్వే అధికంగా 1,878 రైలు సర్వీసులను నిర్వహించనుంది.