తాండూరు సర్కారు దవాఖాన ఘనత
తాండూరు, అక్టోబర్ 20: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో ప్రసవాల సంఖ్య రోజురోజు కూ పెరుగుతున్నది. మెరుగైన సేవలు అందుతుండటంతో జిల్లాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నా రు. మంగళవారం 24 గంటల్లోనే 38 ప్రసవాలు చేసి ద వాఖాన వైద్యులు, సిబ్బంది రికార్డు సృష్టించారు. జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నెలా 900 నుంచి 1,100 వరకు ప్రసవాలు చే స్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. దవాఖానలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.