RCF | రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd.) ఆర్సీఎఫ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 326 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల కింద నింపనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో అప్రెంటిస్ చేయాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 135
టక్నీషియన్ అప్రెంటిస్- 105
ట్రేడ్ అప్రెంటిస్- 74
కేటగిరీ వారీగా..
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 50
సెక్రటేరియల్ అసిస్టెంట్ 60
రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ (HR) 35
డిప్లొమా కెమికల్ 20
డిప్లొమా సివిల్ 15
డిప్లొమా కంప్యూటర్ 10
డిప్లొమా ఎలక్ట్రికల్ 20
డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ 20
డిప్లొమా మెకానికల్ 20
అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) 50
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్) 4
ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 6
బాయిలర్ అటెండెంట్ 2
ఎలక్ట్రీషియన్ 6
హార్టికల్చర్ అసిస్టెంట్ 6
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) 2

Rcf Posts
అర్హతలు
పై పోస్టులను బట్టి బీకామ్, బీబీఏ, ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా (కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్), ఏదైనా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు.
వయసు
ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 18 ఏండ్లు నించి ఉండాలి. గరిష్టంగా 25 ఏండ్లు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10, 1984 నాటి అల్లర్ల బాధిత కుటుంబాలకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. RCF వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కెరీర్స్/రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లాలి. దానిలో NAPS/NATSలో ఏది వర్తిస్తే దానిలో రిజిస్ట్రేషన్ చేయాలి. తరువాత RCF అప్రెంటిస్ ఆన్లైన్ దరఖాస్తు లింక్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో కోరుకున్న విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలి. తరువాత అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియను
సెప్టెంబర్20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలి.

Apprentce
ఎంపిక
విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హతకు సంబంధించిన కోర్సులో మార్కులు సమానంగా వస్తే ఉన్నత విద్యను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి స్టైపెండ్ నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 17,300, టెక్నికల్ అప్రెంటిస్‌లకు రూ. 16,000, ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 14,600 ఇస్తారు.
దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ www.rcfltd.comలో చూడండి.