AP News | రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా : అయ్యన్నపాత్రుడు
AP News | ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంచేశారు. నర్సీపట్నంలో జరిగిన తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
AP News : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంచేశారు. నర్సీపట్నంలో జరిగిన తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వయసు పైబడటంవల్ల విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయ్యన్న అసెంబ్లీ స్పీకర్గా తనకు మిగిలి ఉన్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. గత 31 ఏళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. మరోవైపు రేపు నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘బీసీ ఐక్య వేదిక సదస్సు’ నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తుంటే.. వైసీపీ మాత్రం బీసీల హక్కులపై రాజకీయం చేస్తూ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

