చుంచుపల్లి, సెప్టెంబర్ 05 : ఉపాధ్యాయులు ఉత్తమ సామాజిక నిర్మాతలని, దేశ అభివృద్ధికి పునాది వేసే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యానగర్‌లోని అసోసియేషన్ భవనంలో విశ్రాంత ఉపాధ్యాయులు దేవరపు వెంకటేశ్వరరావు, చింతలపూడి వెంకన్నను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రసాద్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.