పోక్సో కేసులో 30 ఏండ్ల జైలు
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 30 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి క్షమా దేశ్‌పాండే గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
వరంగల్ లీగల్, అక్టోబర్ 22 : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 30 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి క్షమా దేశ్‌పాండే గురువారం సంచలన తీర్పు వెలువరించారు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ దేశాయిపేటకు చెందిన పదేండ్ల బాలిక పాఠశాలకు వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌గౌస్ పాషా బిసెట్లు కొనిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కడుపు నొప్పి భరించలేక జరిగిన విషయం తన మేనత్తకు తెలుపడంతో వారు ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ఇన్స్పెక్టర్ మల్లేశ్, వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరిబాబు నిందితులపై కేసు నమోదుచేసి సాక్ష్యాధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు మహ్మద్ గౌస్‌పాషా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడని భావించి 30 ఏండ్ల కఠిన కారాగార శిక్ష తోపాటు రూ.20వేల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరమణ వాదించగా లైజన్ ఆఫీసర్ కంతేటి హరికృష్ణ నేతృత్వంలో కోర్టు డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ సర్దార్ అలీ సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. భరోసా సెంటర్ న్యాయవాది నీరజ పర్యవేక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

