కాన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 30 మందికి వైరస్ సోకినట్టు బయటపడింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 66కు చేరుకుంది. ఈ 66 మందిలో 45 మంది పురుషులు కాగా.. మిగిలిన 21 మంది మహిళలు. కాన్పూర్లో గతనెల 23న జికా వైరస్ తొలి కేసు నమోదైంది.