సుల్తాన్పూర్: ఓ మైనర్‌ను రేప్‌చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని కోర్టు ముగ్గురు సోదరులకు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ప్రతి ఒక నిందితుడికి 31వేల జరిమానా కూడా కోర్టు విధించింది. రేప్‌కు గురైన అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఆ ముగ్గురు నిందితుల్ని షకీల్, కలీమ్, అలీమ్‌గా గుర్తించారు. ప్రభుత్వ అడ్వకేటు సంజయ్ సింగ్ వారి పేర్లను ప్రకటించారు. జూన్ 2010లో రేప్ కేసు నమోదు అయ్యింది. తండ్రి ఊరిలో లేనప్పుడు 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఆమె తనకు తాను నిప్పు అంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. నెల రోజు నుంచి తనను ఆ నలుగురు సోదరులు రేప్ చేస్తున్నట్లు చావడానికి ముందు ఆ అమ్మాయి తన తండ్రికి చెప్పింది. తనను వ్యభిచారంలోకి నెట్టివేస్తామని బెదిరించినట్లు కూడా ఆమె తెలిపింది.