న్యూఢిల్లీ: వీర్య దాత వీర్యం ద్వారా పుట్టిన సుమారు 200 మంది బాలలు క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఐరోపాకు చెందిన ఈ వీర్య దాత 2005 నుంచి వీర్యాన్ని దానం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నా పరీక్షల్లో టీపీ53 జన్యువులో లోపం ఉన్నట్లు వెల్లడైంది. కణుతులు, క్యాన్సర్ల నుంచి రక్షించే ఈ జన్యువులో లోపం వల్ల ఆయన వీర్యంతో పుట్టిన వారిలో సుమారు 20 శాతం మందికి లీ-ఫ్రామెనీ సిండ్రోమ్ సంక్రమించింది. వీరికి బ్రెయిన్ ట్యూమర్స్, లుకేమియా లేదా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90 శాతం మేరకు ఉంటాయి.