Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Delhi Traders: ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆదివారం బహిరంగసభ జరిగిన విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీలో సుమారు 25 పెద్ద మార్కెట్లకు చెందిన దాదాపు రెండున్నర లక్షల షాపులను మూసివేశారు. అయితే ఆ షాపులను బంద్ చేయడం వల్ల దాదాపు 11వేల కోట్ల వ్యాపారం దెబ్బతిన్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం ఇండియా కూటమి పార్టీలు భారీ బహిరంగసభ నిర్వహించిన విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీలో సుమారు 25 పెద్ద మార్కెట్లకు చెందిన దాదాపు రెండున్నర లక్షల షాపులను మూసివేశారు. అయితే ఆ షాపులను బంద్ చేయడం వల్ల దాదాపు 11వేల కోట్ల వ్యాపారం దెబ్బతిన్నట్లు ట్రేడర్లు(Delhi Traders) పేర్కొన్నారు. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మెన్ బ్రిజేశ్ గోయల్ మాట్లాడుతూ రామ్లీలా మైదానం సమీపంలో 80 శాతం షాపులను మూసివేశారన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ వల్ల షాపులను మూసివేశారని, దీని వల్ల కస్టమర్ల రాక, సరఫరాదారులు, డీలర్లు ఇబ్బందిపడినట్లు చెప్పారు. వ్యాపారం కోసం ఢిల్లీకి ప్రయాణించే సుమారు నాలుగు లక్షల మంది చిరు వ్యాపారులు రాలేకపోయినట్లు గోయల్ తెలిపారు. లోడింగ్, అన్లోడింగ్ ఆపరేషన్స్ స్తంభించాయన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

