ఒకప్పుడు నిధుల కేటాయింపులో నిరాధరణకు గురైన జలమండలి. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. విశ్వనగరిగా రూపాంతర చెందుతున్న భాగ్యనగరి సిగలో జలమండలి ఓ మణిహారాన్ని తలపిస్తున్నది. మెరుగైన తాగు, మురుగు నీటి సేవలందించడమే లక్ష్యంగా కేటాయింపులు చేశారు. గతంతో ఎన్నడూ లేని విధంగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జలమండలికి అగ్రతాంబూలం వేశారు. 2022-23 సంవత్సరానికిగానూ రూ. 1925 కోట్లు కేటాయించారు. కృష్ణా, గోదావరి హడ్కో రుణ చెల్లింపులకు రూ. 700కోట్లు, సీవరేజీ, ఇతర అభివృద్ధి పనులకు రూ. 200కోట్లు, సుంకిశాల తాగునీటి పథకానికి రూ. 725కోట్లు, ఉచిత తాగునీటి పథకానికిగానూ రూ. 300కోట్లు కేటాయించారు.
ఒకప్పుడు నిధుల కేటాయింపులో నిరాధరణకు గురైన జలమండలి. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. విశ్వనగరిగా రూపాంతర చెందుతున్న భాగ్యనగరి సిగలో జలమండలి ఓ మణిహారాన్ని తలపిస్తున్నది. మెరుగైన తాగు, మురుగు నీటి సేవలందించడమే లక్ష్యంగా కేటాయింపులు చేశారు. గతంతో ఎన్నడూ లేని విధంగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జలమండలికి అగ్రతాంబూలం వేశారు. 2022-23 సంవత్సరానికిగానూ రూ. 1925 కోట్లు కేటాయించారు. కృష్ణా, గోదావరి హడ్కో రుణ చెల్లింపులకు రూ. 700కోట్లు, సీవరేజీ, ఇతర అభివృద్ధి పనులకు రూ. 200కోట్లు, సుంకిశాల తాగునీటి పథకానికి రూ. 725కోట్లు, ఉచిత తాగునీటి పథకానికిగానూ రూ. 300కోట్లు కేటాయించారు.
కృష్ణా జలాల సరఫరాలో నగర వాసులకు పూర్తి స్థాయిలో భరోసా దక్కింది. హైదరాబాద్ ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 1450కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసి, తొలుత రూ. 725కోట్ల మేర మంజూరు చేసింది. తాజా బడ్జెట్లో రూ. 725కోట్లు కేటాయించారు. సుంకిశాల వద్ద పంప్‌హౌస్, భారీ సబ్‌స్టేషన్, అధికారుల కార్యాలయాలు ఇతర నిర్మాణాల కోసం దాదాపు వంద ఎకరాలు సేకరించారు. సుంకిశాల నుంచి కోదండపూర్‌లోని నీటి శుద్ధి కేంద్రాల వరకు 18 కిలోమీటర్ల మేర మూడు వరుసలతో భారీ పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రారంభించింది.గతేడాది ఉచిత తాగునీటి సరఫరా కోసం రూ. 250కోట్ల కేటాయించారు. తాజా బడ్జెట్లో మరో రూ. 300కోట్ల మేర జలమండలి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ పథకంతో పేద మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గింది.
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సారథ్యంలో హైదరాబాద్‌లో పటిష్ట శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ 7.5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు నిరంతరం ప్రజలకు భద్రతను కల్పిస్తున్నారు. దీనికి తోడు అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు, ఇంటర్‌సెప్టర్ వాహనాలు, మొబైల్ అప్లికేషన్లు, విజబుల్ పోలీసింగ్‌తో భద్రత పటిష్టంగా మారింది. తాజాగా జూదం, గంజాయి,డ్రగ్స్ దందాలకు పాతరేశారు. దీంతో మత్తుకు బానిసైన యువకుల్లో మార్పు తెచ్చి వారికి మెరుగైన జీవనం అందించేందుకు పోలీస్ శాఖ పనిచేస్తున్నది. డ్రగ్స్ అనేది రాష్ట్రంలో ఉండకుండా చేసేందుకు పట్టణాలు, జిల్లాలు, రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టారు. వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపిన పోలీసు శాఖ నేడు గుడుంబా, పేకాట, గ్యాంబ్లింగ్ వంటి మాటలు వినపడకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత ఘర్షణలు లేని నగరంగా తీర్చిదిద్దారు.
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పాతబస్తీలో 5.5 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. అదేవిధంగా నగరం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు కారిడార్ కోసం రూ.377.35 కోట్లను కేటాయించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 30 కి.మీ మేర ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ప్రాజెక్టు రుణాల కోసం మరో రూ.1500 కోట్లను కేటాయించారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఈసారి బడ్జెట్లో రూ.2377 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో మొత్తంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు రూ.510కోట్లను కేటాయించారు. ఇందులో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ‘జైకా’ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.200 కోట్లను కేటాయించారు. మనీ కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్స్‌గా రూ. 100కోట్లు కాగా అభివృద్ధి కార్యకలాపాల రుణాల కోసం మరో రూ.10కోట్లను కేటాయించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కోసం మరో రూ.200 కోట్లు కేటాయించారు.
గత ప్రభుత్వాలు, పాలకులు ఎంటోమెంట్ ఉద్యోగులు, అర్చకుల సమస్యల గురించి కనీసం పట్టించుకోలేదు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎండోమెంట్ ఉద్యోగులు, అర్చకుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారు. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు ఇవ్వడం సంతోషం.సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– అర్చకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, చిన్నం మోహన్
ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం కింద బడ్జెట్లో నిధులు కేటాయించడం ఎంతో సంతోషం. బ్రాహ్మణులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సమాజానికి అపారమైన గౌరవం కల్పిస్తున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వాసుదేవ శర్మ, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు
ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినులకు హైజినిక్ను కిట్లను పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఈ నిర్ణయం మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. బాలికల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది.ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నాం.
– నిర్మల రాథోడ్, ప్రిన్సిపాల్ జడ్పీహెచ్ఎస్, శామీర్‌పేట
