వయనాడ్: కేరళలోని వయనాడ్‌లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో 19 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. ఈ కేసుతో లింకున్న మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు అయిన వారంతా స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యకర్తలే. రెండు వారాల పాటు వాళ్లను రిమాండ్‌లోకి తీసుకున్నారు. వయనాడ్‌లోని రాహుల్ ఆఫీసుపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అదనపు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించింది. కాల్పెటా డీఎస్పీని సస్పెండ్ చేశారు. మంత్రి వీనాజార్జ్ పర్సనల్ సిబ్బంది రాహుల్ ఆఫీసుపై దాడి కేసులో ఉన్నట్లు ప్రతిపక్ష నేత సతీశన్ ఆరోపించారు.