పసుపు పచ్చ పుచ్చకాయలు చూశారా..!?

కల్బుర్గి: మనకు ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలే తెలుసు. కర్ణాటకలోని ఒక రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలను ప్రజలకు తినేందుకు అలవాటు చేసి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు.
బసవరాజ్ పాటిల్ అనే యువ రైతు కల్బుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్. తొలిసారిగా పసుపురంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పండిస్తున్నాడు. తాను పండించే పుచ్చకాయలు ఎరుపుగా లేకపోవడంతో తినేందుకు ప్రజలు విముఖత చూపారు. దాంతో తన ఉత్పత్తులను విక్రయించడానికి నగరంలోని స్థానిక మార్ట్, బిగ్ బజార్లతో కలిసి పనిచేశాడు. ప్రజలకు వీటిని తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ పాంప్లెట్స్ పంచిపెట్టారు. ప్రజలు పసుపు పుచ్చకాయలను తినడం మొదలుపెట్టడంతో ఇప్పుడు పాటిల్ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. పుచ్చకాయల ఉత్పత్తికి తొలుత రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటివరకు అమ్మకాల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందారు. ఎర్ర పుచ్చకాయల కన్నా పసుపు పుచ్చకాయలు తియ్యగా ఉంటాయని పాటిల్ పేర్కొంటున్నారు. భారతదేశంలో పంట ఉత్పత్తిని రైతులు వైవిధ్యపరచాలని యువ గ్రాడ్యుయేట్ అభిప్రాయపడుతున్నారు.
పసుపు పండుతో ఎన్నో లాభాలు..
ఇంతకుముందు, గోవాకు చెందిన ఇంజినీర్‌గా మారిన రైతు నితేష్ బోర్కర్ కూడా పసుపు పుచ్చకాయలను సేంద్రీయంగా పండించాడు. రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించకుండా 250 పసుపు పుచ్చకాయలను సాగు చేశాడు. సిట్రల్లస్ లానాటస్ అని శాస్త్రీయంగా పిలుచుకునే ఈ రంగు పుచ్చకాయలు మొదట ఆఫ్రికాలో పెంచారు. ప్రస్తుతం ఈ పండు ప్రపంచవ్యాప్తంగా 1,000 రకాలకు పైగా పండిస్తున్నారు.
పసుపు పుచ్చకాయ రంగు లేత పసుపు నుంచి కొద్దిగా బంగారు వర్ణం వరకు ఉంటుంది. అవి తరచుగా తినదగిన గోధుమ-నలుపు విత్తనాలను కలిగి ఉంటాయి. పసుపు పుచ్చకాయలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు పుచ్చకాయ కంటే ఎక్కువగా పసుపు పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి క్యాన్సర్లు రాకుండా, కంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగించేలా సహాయపడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

