జెరూసలేం, డిసెంబర్ 21:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అనేక దేశాలకు విస్తరిస్తున్నది.
గురువారం యెమెన్‌పై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేయగా, బదులుగా శనివారం హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ప్రొజక్టైల్ క్షిపణిని ప్రయోగించారు. తాము విఫలమవటంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్టు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో పేర్కొన్నది.