న్యూఢిల్లీ : భారతీయులు నూతన సంవత్సర వేడుకలను రుచికరమైన బిర్యానీని ఆస్వాదిస్తూ జరుపుకొన్నారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీకి బుధవారం రాత్రి 8 గంటలకు ముందే నిమిషానికి 1,336 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. బుధవారం రాత్రి 7.30 గంటలకు 2,18,993 ఆర్డర్లు వచ్చాయి. వీటిలో 16 కిలోల బిర్యానీ సింగిల్ ఆర్డర్ కూడా ఉంది. ఈ ఆర్డర్ భువనేశ్వర్ నుంచి వచ్చింది. మరోవైపు, పిజ్జా, బర్గర్ల కోసం ఆర్డర్లు కూడా పోటాపోటీగా వచ్చాయి. బుధవారం రాత్రి 8.30 గంటలకు 2.18 లక్షలకుపైగా పిజ్జా ఆర్డర్లను, 2.16 లక్షల బర్గర్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. బుధవారం రాత్రి 10.30 గంటల వరకు స్వీట్ల కోసం వచ్చిన టాప్ 5 ఆర్డర్లలో రసమలై, గజర్ హల్వా, గులాబ్ జామ్ ఉన్నాయి.