BOB | భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కూడా ప్రధానమైన బ్యాంక్. ఇది SBI తరువాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 1100 వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. రెగ్యులర్ ప్రాతిపదికన వీటిని నింపనుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) 1000
కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో క్రెడిట్ అనలిస్ట్-C&IC (MMG/S-II)100. ఈ పోస్టులను దేశంలోని ఏ బ్రాంచ్‌లోనైనా నియమించవచ్చు.
అర్హతలు
వెల్త్ ఎగ్జిక్యూటివ్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. దీంతో పాటు IC 38 (Insurance Institute of India), NISM Series V A (Mutual Fund Distributors), NISM Series XXI-A (PMS Distributors), లేదా NISM Series V-D (Mutual Fund – Specialised Investment Fund Distributors) సర్టిఫికేషన్ ఉండాలి. పీజీ, డిప్లొమా లేదా ఎంబీఏ (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాకింగ్) పూర్తిచేసినవారు కూడా అర్హులు. రెండేండ్ల అనుభవం కూడా ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్-C-Iకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ కూడా ఉండాలి. మేనేజ్మెంట్లో పీజీ, ఎంబీఏ తదితర తత్సమాన కోర్సులు చేసినవారు కూడా అర్హులు. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఏడాది పని అనుభవం ఉండాలి.

Bob Posts
వయసు
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కనిష్టంగా 22, గరిష్టంగా 32 ఏండ్లు ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు కనిష్టంగా 21, గరిష్టంగా 33 ఏండ్లు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10 నుంచి 15, ఎక్స్సర్వీస్మెన్లకు కేటగిరీని బట్టి 8 నుంచి 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేముందు తగిన వయసు ఉందో లేదో చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ కోరుతుంది.
దరఖాస్తు
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు రూ. 850 + పేమెంట్ గేట్‌వే చార్జెస్ (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్). మహిళలు,ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175 + పేమెంట్‌గేట్‌వే చార్జెస్.
ఎంపిక
దరఖాస్తుల స్క్రూటినీ, ఆన్లైన్ పరీక్ష, సెకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20, జనరల్/ఎకనామిక్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 20, వృత్తిపరమైన పరిజ్ఞానం 60 ప్రశ్నలు ఇస్తారు. 120 మార్కులు, సమయం 120 నిమిషాలు.

Bob Job
జీతం
ఎంపికైనవారికి నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్ రూ. 48,480 నుంచి 85,920, క్రెడిట్ అనలిస్ట్ రూ. 64,820 నుంచి 93,960 + అలవెన్సులు ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఏపీలో గుంటూరు లేదా విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ సెప్టెంబర్ 24. వివరాలు వెబ్సైట్ www.bankofbaroda.bank.inలో చూడండి.
అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా గత నెలలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 7తో ముగియనుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.