వరదలో గల్లంతైన 11 మంది సేఫ్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులతోపా టు వారిని రక్షించేందుకు వెళ్లి గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేమంగా బయటపడ్డాయి.
- క్షేమంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- బేతుపల్లి చెరువు వద్ద తెల్లవారు జామున లభించిన ఆచూకీ
- ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం, బాధితుల కుటుంబ సభ్యులు
సత్తుపల్లి టౌన్, నవంబర్ 5 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులతోపా టు వారిని రక్షించేందుకు వెళ్లి గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేమంగా బయటపడ్డాయి. మురసు తుపాన్ ప్రభావంతో బేతుపల్లి చెరువు వరదల్లో బుధవారం చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు వరదలో చిక్కుకోవడం.. వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సైతం వరద ఉధృతికి బోటు బోల్తా పడటంతో 11 మంది గల్లంతైన విషయం తెల్సిందే.
వరద ఉధృతిలో రాత్రంతా వారు మృత్యువుతో పోరాడుతూ చెట్ల కొమ్మలు, చెరువు దరులను పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నారు. వీరంతా గురువారం ఉదయం క్షే మంగా ఒడ్డుకు చేరడంతో వారి కుటుంబ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రంతా వర్షం లేకపోవడం.. వరద ఉధృతి తగ్గిపోవడంతో గురువారం తెల్లవారుజామున క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ఉత్కంఠకు తెరపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

