జల సంరక్షణతోనే పల్లెలకు ఉపాధి భరోసా
నీటి వనరుల పునరుద్ధరణ, పునర్జీవం, పరిరక్షణలో ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యంతో 2027 జనవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
- జనవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమం
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : నీటి వనరుల పునరుద్ధరణ, పునర్జీవం, పరిరక్షణలో ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యంతో 2027 జనవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటూనే జల సంరక్షణ ద్వారా పల్లెల్లో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని పేర్కొన్నా రు. గురువారం సచివాలయంలో నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
వర్షాకాలానికి ముందు ఆరు నెలలపాటు అమలుచేయనున్న ప్రణాళికలపై చర్చించారు. జలవనరుల ఆస్తులను సృష్టించాలని, గ్రామస్తులను, వ్యవసాయ కూలీలను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఇప్పటికే 355 రకా ల పనులతో జాబితా సిద్ధమైందని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటి పారుదల సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, ఈఎన్సీ (జనరల్) రమేశ్‌బాబు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

