హోంశాఖను గాలికొదిలేసిన సీఎం!
విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడాల్సిన రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికే రక్షణ కరువవుతున్నదా? అత్యవసర పరిస్థితుల్లో రెస్యూ ఆపరేషన్లు నిర్వహించాల్సిన బలగాలకు అవసరమైన శిక్షణ, ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతు లు అందుబాటులో ఉన్నాయా? అంటే హోం శాఖ వద్ద సరైన సమాధానమే లేదు.
- ఎస్డీఆర్ఎఫ్ బేసిక్ ట్రైనింగ్, వసతులపై నీలినీడలు!
- నాడు మోరంచపల్లిలో ముందస్తుగానే రెస్క్యూలు
- నేడు చెరువులో జాలర్ల రెస్క్యూకు ఇబ్బందులు
- సత్తుపల్లి ఘటనతో చర్చ
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడాల్సిన రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికే రక్షణ కరువవుతున్నదా? అత్యవసర పరిస్థితుల్లో రెస్యూ ఆపరేషన్లు నిర్వహించాల్సిన బలగాలకు అవసరమైన శిక్షణ, ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతు లు అందుబాటులో ఉన్నాయా? అంటే హోం శాఖ వద్ద సరైన సమాధానమే లేదు. హోంశాఖలోని అన్ని శాఖలను సీఎం గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీస్ విభాగంతోపాటు అత్యంత కీలకమైనవి అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖలు. వాటి ప్రాధాన్యాన్ని గుర్తించిన నాటి సీఎం కేసీఆర్.. ఎస్డీఆర్ఎఫ్కు ప్రాణం పోశారు. 2023 వర్షాకాలానికి బృందాన్ని సిద్ధం చేసి, నిపుణులతో శిక్షణ ఇప్పించారు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కు రాష్ట్రవాటాగా నగదు చెల్లించేందుకు ఆర్థిక అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా పురుడుపోసుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 2023 జూలైలో వచ్చిన వరదల్లో ఎన్డీఆర్ఎఫ్కు దీటుగా మోరంచపల్లిలో రెస్క్యూ చేపట్టాయి.
నాడు ఊరంతా నిద్రపోతున్న వేళ రెస్క్యూ!
2023 జూలైలో సంభవించిన భారీ వర్షాలకు జయశంకర్-భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని అర్ధరాత్రి 3 గంటలకు ఒక్కసారిగా వరద కమ్మేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు ఇండ్లపైకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడిపారు. కట్టుబట్టలు తప్ప తినడానికేమీ లేవు. తెల్లవారుతుండగానే మోరంచపల్లి వరదల్లో మునిగిపోయిందనే వార్త తెలంగాణ మొత్తం వ్యాపించింది. వరదల్లో చిక్కుకున్న అందరినీ ఎలాగైనా కాపాడాలని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, వైమానిక దళాలకు నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
ఎవరి ప్రయత్నం వారిది.. హెలికాప్టర్ల రాక ఆలస్యం కావడంతో.. అప్పటికే వాటర్ రెస్క్యూలో శిక్షణ తీసుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం అందుబాటులో ఉన్న బోట్ల సాయంతో మోరంచపల్లికి మొదటిగా చేరుకున్నది. అటకలు, ఇండ్లపై తలదాచుకున్న వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 131 వర ద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను తరలించడం లో ఇవే బృందాలు కీలకంగా వ్యవహరించాయి. నాటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 4,996 పునరావాస కేంద్రాల్లో సుమారు 19 వేల మందిని తరలించి ప్రాణనష్టం లేకుండా ఎస్డీఆర్ఎఫ్ అడ్డుకున్నది.
ఇప్పుడు చెరువులోనూ రిస్క్!
నాడు చాలా రెస్క్యూ ఆపరేషన్లు చేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందం.. తాజా గా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు లో చికుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లి రిస్క్‌లో పడింది. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లిన రెండు బోట్లు బోల్తాపడి వరద ఉధృతిలో గల్లంతైన ఘటన రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలోని లోపాలపై చర్చకు దారితీసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన లో 11 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రాత్రి బోట్లు సరిగా పనిచేయకపోవడం, అదే క్రమంలో వరద పెరుగడం, రెండు బోట్లు కొట్టుకుపోవడంతో రెస్క్యూకు వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలే రిస్క్‌లో పడ్డాయి.
వారిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పంద న దళం (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాల్సి వచ్చింది. గురువారం ఉదయం వా రు సురక్షితంగా బయటకు వచ్చినా.. ఈ పరిణామం ఎస్డీఆర్ఎఫ్ సన్నద్ధతపై అనేక సందేహాలను లేవనెత్తింది. వాటర్‌ప్రూఫ్ కమ్యూనికేషన్ సెట్లు, జీపీఎస్, ఇతర సేఫ్టీ పరికరాలు లేకపోవడం వల్లనే తెల్లవారుజాము వరకూ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియలేదని పేర్కొంటున్నారు. ఇవన్నీ సమకూర్చడంతోపాటు సిబ్బందికి నిరంత రం శిక్షణ, మాక్‌డ్రిల్స్ నిర్వహించ డం కూడా అవసరమేనని అంటున్నారు.
బేసిక్ ట్రైనింగ్ మాటేమిటి?
తెలంగాణ అగ్నిమాపక శాఖలోకి వచ్చే సిబ్బందికి ఏ స్థాయిలో ప్రాథమిక శిక్షణ అందుతున్నదనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. హజార్డస్, బిల్డింగ్, ఫైర్, వాటర్, ఇతర రెస్క్యూ కోసం ప్రత్యేకంగా ఇచ్చే శిక్షణపైనే అ నుమానాలు తలెత్తుతున్నాయి. వరద ప్రవాహాల్లో ఈత, నీటి అడుగున చికుకున్న వారిని గుర్తించడం, బోట్లను నడుపడం, బోటు బో ల్తాపడినప్పుడు సిబ్బంది సురక్షితంగా బయటపడే పద్ధతులపై కూడా శిక్షణ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంజిన్ బోట్లు, ఇన్ ఫ్లేటబుల్ బోట్లు నడుపడం, వరద ప్రవాహాలకు అనుగుణంగా ప్రయాణించడం, అత్యవసర పరిస్థితుల్లో బోటును నియంత్రించడం, చెరువుల్లోనూ, క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ చేయగల ప్రాథమిక శిక్షణ.. తొలి శిక్షణ కాలంలోనే ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద తీవ్రతను అంచనా వేయ డం, సిబ్బంది భద్రతను నిర్ధారించడం, సమన్వయంతో సహాయక చర్యలు నిర్వహించడం వంటి అంశాల్లో వెనుకబడటం వల్లే సత్తుపల్లిలో తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తప్పనిసరిగా ఉండాల్సిన రెస్క్యూ పరికరాలివే..
1.అధునాతన మోటరైజ్డ్ బోట్లు, ఇన్ ఫ్లేటబుల్ బోట్లు
2.లైఫ్ జాకెట్లు, హెల్మెట్లు, వాటర్ ప్రూఫ్ దుస్తులు, సేఫ్టీ బెల్టులు
3.రెస్యూ రోప్స్, త్రోయింగ్ బ్యా గులు, ఫ్లోటింగ్ ట్యూబులు
4.నీటి అడుగున గాలింపు పరికరాలు, అవసరాన్ని బట్టి డైవింగ్ సామగ్రి
5.జీపీఎస్, వైర్లెస్ సెట్లు, వాటర్ ప్రూఫ్ కమ్యూనికేషన్ పరికరాలు
6.డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, సెర్చ్ లైట్లు
7.అత్యవసర వైద్య కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్స్‌లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

