రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్ కేసులు
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది.
తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. మృతుల సంఖ్య 1,712కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డిలో 104, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 113, నిజామాబాద్‌లో 75, సంగారెడ్డిలో 46, జగిత్యాలలో 40, నిర్మల్‌లో 40, కరీంనగర్లో 34 కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్
బెంగాల్లో భారీగా పెట్రోల్ బాంబులు
జర్నలిస్టులకు టీకా ఇవ్వండి.. కేంద్రానికి లేఖ
నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
మళ్లీ సిలబస్ తగ్గించేది లేదు: సీబీఎస్సీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

