
అందోల్ : అన్ని గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా వేయాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్- జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించగా.. జడ్పీ చైర్పర్సన్ నేరడిగుంట, చింతకుంట, కన్సాన్పల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొవిడ్-19 స్పెషల్ డ్రైవ్ క్యాంప్‌ను సందర్శించి.. సిబ్బందితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటుచేసిందిని, దీన్ని గుర్తించి
వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో 100 శాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.